calender_icon.png 18 January, 2026 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బోరు వేయించిన సర్పంచ్!!

18-01-2026 09:28:08 PM

కేతవత్ లక్ష్మీ దుర్గ్య నాయక్!! 

పుష్కలంగా నీరు పడటంతో సంతోషించిన గ్రామస్తులు!!

శివంపేట్,(విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని భీమ్లా తాండ గ్రామపంచాయతీ పరిధిలోని థౌర్య తాండలో శ్రీ సేవాలాల్ జగదాంబ ఆలయం గుడి దగ్గర బోరు వేయిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం భీమ్లా తాండ సర్పంచ్ కేతావత్ లక్ష్మీ దుర్గ్య నాయక్ ఆధ్వర్యంలో సుమారు రూ.60,000/-లతో బోర్ వేయించి మాట నిలబెట్టుకోవడం జరిగింది.

ఈ బోరులో నీరు పుష్కలంగా పడడంతో గ్రామస్తులు సంతోషించారు. ఈ కార్యక్రమంలో భీమ్లా తాండ సర్పంచ్ లక్ష్మీ దుర్గ్య నాయక్ ఉపసర్పంచ్ కంసా వెంకటేష్ నాయక్ వార్డ్ మెంబర్ నరేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాండు నాయక్,తుకారాం నాయక్ సీనియర్ నాయకులు గేమ్స్ సింగ్ నాయక్ నాజం, పాతూలోత్ విజేష్, వినోద్, పి.భాస్కర్, సుధాకర్ కిషన్, మీట్య, వినేష్, తాండ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.