calender_icon.png 18 January, 2026 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలసాని పిలుపుతో శాంతి ర్యాలీకి ప్రజల భారీ మద్దతు

18-01-2026 09:42:17 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన ఉద్యమానికి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎనలేని ప్రోత్సాహం, సహకారం  అందిస్తున్నారని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో  ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు కలిసి సన్మానించి తమ ఉద్యమానికి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

220 సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలను ప్రజలకు వివరించి ప్రజలు తమ ఉద్యమానికి మద్దతు తెలిపేలా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతో కృషి చేశారని అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం నాడు నిర్వహించ తలపెట్టిన శాంతి ర్యాలీకి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ ఉద్యమానికి మద్దతు తెలిపారని, ఆందోళనలో పాల్గొన్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ కార్పోరేషన్ ఏర్పాటయ్యే వరకు ఎన్ని అడ్డంకులు కల్పించిన తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.