calender_icon.png 18 January, 2026 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో 117 మున్సిపల్ లకు కాంగ్రెస్ 80 శాతం కైవసం చేసుకుంటుంది

18-01-2026 09:38:20 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో 117 మున్సిపల్ లకు గాను 80 శాతంకు పైగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఆదివారం రాత్రి  సుల్తానాబాద్  మున్సిపల్ పరిధిలోని 10, 12 వార్డుల్లో 23 ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి భూమి పూజలు నిర్వహించిన అనంతరం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలు ఎమ్మెల్యే అందజేశారు.

ముందుగా 10, 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతటి పుష్పలత అన్నయ్య గౌడ్,  దున్నపోతుల లలిత రాజయ్య మధు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయ రమణారావు కు గజ మాలతో ఘన స్వాగతం పలుకగా అమిరీ శెట్టి తిరుపతి ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు  మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ అభివృద్ధిని మరిచి పాలన కొనసాగించిందని సుల్తానాబాద్ పట్టణాన్ని బ్రష్టు పట్టించి ఇక్కడి పాత తాలూకా కార్యాలయాలను సైతం తరలించక

పోయినా ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గం కోట్లాది రూపాయలతో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని నియోజకవర్గంలో బస్సు డిపోను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని తాము అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు అందించామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను రెండు సంవత్సరాల కాలంలోనే ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చామని సూచించారు.

దేశంలోనే ఐదు లక్షల ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దే అన్నారు. ప్రజలకు సన్న బియ్యం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో క్రయ విక్రయాలు సాగించకుండా అసంపూర్తిగా ఉన్న భూమిని 909 /1 909/2 రిజిస్ట్రేషన్ కు అనుకూలంగా మార్చామని పేర్కొన్నారు. ఇక్కడినుండి తరలించుకుపోయిన కార్యాలయాలను తిరిగి తీసుకొచ్చామని తెలిపారు. త్వరలో ఆర్ అండ్ బిని ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని అన్నారు. సుల్తానాబాద్ పట్టణాన్ని అత్యంత ఆధునికరంగా సుందరీ కరణ నగరంగా అభివృద్ధి పరచమన్నారు.

గతంలో ఐదుసార్లు టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన పాపానికి సుల్తానాబాద్ ను బ్రష్టు పట్టించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే సంక్షేమ కార్యక్రమాలలో దూసుకు పోయామని తెలిపారు. మరో మూడు సంవత్సరాలు కాలం ఉందని అప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్క నిరుపేదకు అందించి తీరుతామని తధానంతరం ఇల్లు కట్టుకునే లబ్ధిదారుల కోసం వెతకాల్సిన పరిస్థితిలు నెలకొంటాయని అన్నారు. మరో ఐదు సంవత్సరాలు కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ప్రజలందరూ ఆశీర్వదించి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా అండగా వ్యవహరించాలన్నారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ విజయడంకా మోగించిందని హైదరాబాద్ ఉప ఎన్నికలలో సైతం అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ విజయ డగ్గా మోగించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 80% విజయం సాధించి తీరుతారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని రానున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి విజయకేతనం ఎగురవేయాలని సూచించారు. స్థానిక చేనేత సహకార సంఘానికి ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడుతున్న అన్నారు.

అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారుల ప్రొసీడింగ్ అందించారు. సుల్తానాబాద్ మున్సిపల్ లో అభివృద్ధి లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్, శ్రీ వేణుగోపాలస్వామి  దేవాలయం చైర్మన్ పల్ల మురళీధర్, ఉట్ల వర ప్రదీప్,  ఓదెల దేవాలయండైరెక్టర్ సామల యమున, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దామోదర్ రావు, ధన్ నాయక్ శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలుక సతీష్ , అమీర్ శెట్టి రాజలింగం , అమీర్ శెట్టి తిరుపతి ,మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీ గిరి శ్రీనివాస్, పల్లా సురేష్ తోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పలువురు పాల్గొన్నారు.