calender_icon.png 18 January, 2026 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతి త్వరలో నాగిరెడ్డిపేట్ మండలానికి మినీ స్టేడియం

18-01-2026 09:32:50 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో గత నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ నిరుడి రాజు ఆర్గనైజేషన్లో నిర్వహించారు. ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ గెలుపొందిన జట్లకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు బహుమతులు అందజేశారు. క్రికెట్ టోర్నమెంట్లో నిర్వహించిన నిరుడు రాజుకు క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ధన్యవాదాలు తెలియజేశారు. క్రికెట్ టోర్నమెంట్లో ప్రథమ జట్టుకు 15,555 ద్వితీయ జట్టుకు 11,111 నగదుతో పాటు బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ... నాగిరెడ్డిపేట్ మండల కేంద్రానికి మినీ స్టేడియం మంజూరు కొరకు ప్రపోజల్ చేయడం జరిగిందన్నారు. ఇవాళ గాంధారికి, తాడ్వాయికి మినిస్ట్రీడియంలు మంజూరయ్యాయని నాగిరెడ్డిపేట మండలానికి కూడా తప్పకుండా మినీ స్టేడియాని తీసుకురావడం జరుగుతుందన్నారు. అలాగే గోపాల్పేట్లో బస్టాండు గత 40 ఏళ్ల క్రితం నిర్మించి పూర్తిగా శిథిలవస్థకు చేరి ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయని దృష్టిలో ఉంచుకొని 33 లక్షల నిధులతో మళ్లీ ఇప్పుడు బస్టాండ్ సుందరంగా ముస్తాబయిందని గరీబుల్లా బస్టాండ్ అని త్వరలో దాన్ని పునర్:ప్రారంభించడం జరుగుతుందన్నారు. బస్టాండ్ ప్రాంగణాలను తిరిగి పరిశీలించారు.