25 August, 2026 | 4:44 AM

వర్షంలోనూ వార్తా సేకరణ.. జర్నలిస్టులకు రెయిన్ కోట్లు

25-08-2026 01:47 AM

వీపనగండ్ల, ఆగస్టు 24:  వర్షాకాలంలో విధులు నిర్వహిస్తున్న గ్రామీణ జర్నలిస్టులకు మండల కేంద్రంలోని ఒకటో వార్డు సభ్యుడు సుబ్రహ్మణ్యం చారి రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆయన అన్నారు. వర్షంలోనూ వార్తల సేకరణకు పర్యటించే జర్నలిస్టులకు తనవంతు సహకారంగా రెయిన్ కోట్లు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు సుబ్రహ్మణ్యం చారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.