25 August, 2026 | 2:46 AM

తెలంగాణ ఇంటెలెక్చువల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

25-08-2026 01:46 AM

అధ్యక్షుడిగా డాక్టర్ సి.రవీందర్ రెడ్డి ఎంపిక

ముషీరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): తెలంగాణ ఇంటెలెక్చువల్స్ అసోసియేషన్  (టిఐఏ) నాలుగో వార్షిక సర్వసభ్య సమావేశం నారాయణగూడలోని భారత్ ఇన్స్టిట్యూషన్స్లో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో తదుపరి మూడేళ్లకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డా. సి. రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా డా. వి. రవీంద్ర బాబు, ప్రధాన కార్యదర్శిగా జి. రాజేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా శరత్ చంద్ర దాస్, కోశాధికారిగా కె. నారాయణరావు ఎన్నికయ్యారు.

కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా బి. షాండిల్య, యు. భవాని, రఘు సతీష్ కుమార్, కె. యజ్ఞ నారాయణ, జి. సుదర్శన్ రెడ్డి, జి.వి. రామారావు, డా. ఎం. వెంకట రమణ ఎంపికయ్యారు. రైతులకు సాంకేతిక సహకారం, సేంద్రీయ వ్యవసాయం, గ్రామీణ యువతకు స్టార్టప్ల ప్రోత్సాహం, విద్యఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సైబర్ మోసాలపై అవగాహన వంటి కార్యక్రమాలను చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లాల వారీగా శాఖలు, గ్రామస్థాయిలో రైతు క్లబ్బులు ఏర్పాటు చేసి ప్రజా ప్రయోజన కార్యక్రమాలను విస్తరించాలని నూతన కార్యవర్గం నిర్ణయించింది.