జయశంకర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం
వేములవాడ పట్టణ సీఐ వీర ప్రసాద్
వేములవాడ, ఆగస్ట్టు 6, (విజయ క్రాంతి): తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.టౌన్ సీఐ వీర ప్రసాద్ ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు శ్రీనివాస్, రామ్మోహన్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ వీర ప్రసాద్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ గారు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. జయశంకర్ సిద్ధాంతాలు, ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.






