7 August, 2026 | 3:25 AM

కూకట్‌పల్లిలో తల్లిపాల వారోత్సవాలు

07-08-2026 02:29 AM

కూకట్‌పల్లి, ఆగస్టు 6 (విజయక్రాంతి): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కూకట్పల్లిలోని మహిళా ప్రాంగణంలో గురువారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజన్ అహమ్మద్ హాజరయ్యారు. వారోత్సవాలలో భాగంగా  గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం వేడుకలు , 7 నెలల పిల్లలకు అన్నప్రాసన, మూడు సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి తల్లి బిడ్డకు పాలు ఇవ్వాలని, ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు మాట్లాడుతూ తల్లిపాల వలన తల్లికి బిడ్డకు ఆత్మీయ సంబంధం కొనసాగుతుందని, తల్లి పాల వలన బిడ్డలకు వ్యాధి నిరోధక శక్తి, మేధాశక్తి పెరుగుతుందన్నారు.

ప్రసవమైన వెంటనే తప్పనిసరిగా ముర్రు పాలు చంటి బిడ్డలకు ఇవ్వాలని సూచించారు. ఆరు నెలలు కేవలం తల్లి పాలు ఇచ్చి ఏడవ నెల నుండి అదనపు ఆహారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది, గర్భిణీ మహిళలు, బాలింతలు,కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల సూపర్వైజర్లు అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.