7 August, 2026 | 3:25 AM

జయశంకర్ ఆశయాలే తెలంగాణకు మార్గదర్శకం

07-08-2026 02:29 AM

తెలంగాణ పోలీస్ అకాడమిలో సిద్ధాంతకర్తకు ఘన నివాళి

రాజేంద్రనగర్, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన తెలంగాణ సిద్ధాం తకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం ఆర్.బి.వి.ఆర్ .ఆర్. తెలంగాణ పోలీస్ అకాడమిలో ఘనం గా నివాళులర్పించారు.

అకాడమిలోని ఏకశి ల అడ్మినిస్ట్రేటివ్ భవనంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అ ధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సం దర్భంగా అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు జి. కవి త, ఎన్. వెంకటేశ్వర్లు, కె.ఆర్.కె. ప్రసాద్ మా ట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లో ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సేవ లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శక త్వం, అంకితభావం, ఉద్యమ స్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి రాష్ట్ర సాధనకు దోహదపడిన మహనీయుడిగా జయశంక ర్ను కొనియాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆయన ఆశ యాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ఏడీ లు వేమా శ్రీనివాసరెడ్డి, యార్లగడ్డ రాంబా బు, నరహరి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి యాద మ్మ, డీఎస్పీలు సతీష్, భాస్కర్, తోట శ్రీనివాసులు, జగదీష్, తిరుపతి, రిటైర్డ్ అదనపు ఎస్పీ సోమశేఖర్తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్కు ఘన నివాళులర్పించారు.