16-05-2025 07:56:05 PM
కామారెడ్డి టౌన్,(విజయక్రాంతి): దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మె జూలై 9 కి వాయిదా వేసినట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. భారతదేశంలో ఈ దేశ కార్మికులకు కర్షకులకు రైతులకు వ్యవసాయ కూలీలకు ప్రమాదకరమైనటువంటి నాలుగు లేబర్ కోర్టులను వ్యతిరేకిస్తూ జాతీయస్థాయి ట్రేడ్ యూనియన్ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. వేల సంఖ్యలో దేశ ప్రజలు ఎక్కడికక్కడ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పడం జరిగింది.
కానీ, భారతదేశంలో నెలకొన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈనెల అంటే మే 20 న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తూ, జులై 9 నాడు ఈ సమ్మెను జరపాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి జిల్లాలో కార్మికులు, రైతులు, కర్షకులు ఈ విషయాన్ని గమనించి జూలై 9న జరిగే ఈ సార్వత్రిక సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మోడీ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేయాలని పిలుపునిస్తున్నాం అని సందర్భంగా సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు ఎస్. వెంకట్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు పాల్గొన్నారు.