calender_icon.png 17 May, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువులను గోశాలకు తరలింపు

16-05-2025 07:52:40 PM

రామకృష్ణాపూర్,(విజయ క్రాంతి): క్యాతన్ పల్లి పురపాలకం పరిధిలో రోడ్లమీద సంచరిస్తూ పాదచారులను, వాహనదారులకు భయబ్రాంతులకు గురి చేస్తు ఇబ్బందిగా మారిన పశువులను గోశాలకు తరలించేస్తామని పుర కమిషనర్ రాజు,ఎస్సై రాజశేఖర్ హెచ్చరించారు. శుక్రవారం మున్సిపల్, పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని రోడ్లమీద, పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పశువులను గోశాలకు తరలించే కార్యక్రమం నిర్వహించారు. పశువులను యజమానులే కట్టడి చేసుకోవాలని గతంలోనే హెచ్చరిక జారీ చేసిన గడువు ముగియడంతో కొన్ని పశువులను గోశాలకు తరలిస్తామని, మిగిలిన పశువులను మరికొన్ని రోజుల్లోనే తరలిచనున్నట్లు తెలిపారు.