1 July, 2026 | 7:18 AM

మామిడిపల్లిలో జర్మనీ బృందం పర్యటన

23-10-2024 01:28 AM

సిరిసిల్ల, అక్టోబర్ 22 (విజయక్రాంతి) : ఆధునిక పద్ధతులు, సాంకేతికతను  ఉపయోగించుకుని సాగు చేసినప్పుడే అధిక దిగుబడులు సాధిస్తామని జర్మనీ ప్రాన్‌హోపర్ డాక్టర్ సెబాస్టియన్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లిలో జర్మనీ బృందం మంగళవారం పర్యటించింది. రైతులతో సమావేశమై పంటల సాగు పద్ధతులను తెలుసుకున్నారు.