calender_icon.png 10 May, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1.50 లక్షల వేతనమని ఘరానా మోసం

10-05-2025 01:51:12 AM

  1. యూరప్‌లో ఉద్యోగమని నమ్మించిన దుబాయ్ ఎజెంట్ 

ఢిల్లీ లాడ్జిలో నెలరోజుల పాటు బాధితుడి నిరీక్షణ

డబ్బులు దండుకుని పరారైన ఏజెంట్ సాహెబ్ ఖాన్

నిజామాబాద్, మే 9 (విజయ క్రాంతి) : గల్ఫ్ దేశంలో డ్రైవర్  ఉద్యోగం నెలకు రూ .లక్ష 50 వేలకు పైగా జీతం అంటూ దాదాపు 8 మంది వద్ద 20 లక్షల రూపాయల కు పైగా డబ్బులు వసూలు చేసిన గల్ఫ్ ఏజెంట్ బాగోతం బాధితుల ద్వారా బయటపడింది. నిజామాబాద్ జిల్లా  ధర్పల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన నూత్ పల్లి నరసయ్య తో పాటు  మరికొంతమంది గల్ఫ్ ఉద్యోగానికై ఏజెంట్ కు అజార్ బైజాన్ దేశంలో ఉద్యోగానికి లక్షల్లో డబ్బులు చెల్లించారు.

గల్ఫ్ ఏజెంట్ ఎస్.కె సాహెబ్ ఎలియాస్ ఖాన్ సాబ్ ఎలియాస్  అను మియా గా పిలవబడే డిచ్పల్లి మండలం గ్రామానికి చెందిన సదరూ వ్యక్తి గల్ఫ్ ఉద్యోగాని కై నూత్ పల్లి నరసయ్య తోపాటు మరికొందరు 2 లక్షల 30 వేల రూపాయల చొప్పున చొప్పున చెల్లించారు. మొత్తం నాలుగు లక్షల చిల్లర ఖర్చు అవుతుందని ముందుగా రెండు లక్షల 50 వేలు ఇస్తే గల్ఫ్ కు పంపిస్తానని తర్వాత మిగతా డబ్బులు చెల్లించవచ్చని నమ్మబలికి నూత్ పల్లి నరసయ్యతో పాటు మరికొందరు వద్ద డబ్బులు వసూలు చేశాడు.

ఈ గల్ఫ్ ఏజెంట్ బాధితులు నరసయ్యతో పాటు మల్లాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పడకల్ గ్రామానికి చెందిన మరో వ్యక్తి నడపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి తుంపల్లి కొండాపూర్ తండా చెందిన ఒక వ్యక్తి నుండి ఒక్కొక్కరి వద్ద నుండి ఐదు లక్షల రూపాయల చొప్పున ఉద్యోగానికి ఖర్చు అవుతుందని ముందుగా డబ్బు చెల్లించాలని వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేసుకున్నాడు.

డబ్బులు చెల్లించిన గల్ఫ్ కార్మికులు  తీవ్ర కాలయాపన జరుగుతుందని నిలదీయడంతో వారిని ఢిల్లీకి తీసుకెళ్లి దాదాపు నెల రోజులపాటు ఢిల్లీలోని లాడ్జి ల్లోనే తమను ఉంచి కాలయాపన చేశాడని బాధితులు వాపోయారు. ముందుగా డబ్బులు రూపాయలు రెండు లక్షల 30 వేలు తీసుకొని వీసా వచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వాలని ముందస్తు హామీగా తమ వద్ద నుండి చెక్కులు కూడా తీసుకున్నట్టు బాధితుడు గంగ నరసయ్య తెలిపాడు.

ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ అని చెప్పి ఇంటర్వ్యూలో నీకు ఇబ్బంది ఉంది కాబట్టి కొద్ది రోజులు ఇక్కడే ఉండు తర్వాత నీకు వీసా పంపిస్తామని చెప్పి నెల రోజులపాటు కాలయాపన చేస్తూ తిండికి కూడా ఇబ్బందులు కలిగించి డైలీ లాడ్జిల్లో తమను ఉంచాడని బాధితుడు తెలిపాడు.

తీరా నెల రోజుల తరబడి ఢిల్లీలోని లాడ్జిలో ఉన్న తాము గల్ఫ్ ఏజెంట్ అనుమియా  ను నిలదీయగా తనపై దాడి చేశారని తప్పుడు ఫిర్యాదు చండీగఢ్ పోలీస్స్టేషన్లో ఇచ్చి అక్కడి పోలీసులు చేద్దామని బెదిరించి భయభ్రాంతులకు గురిచేసాడని బాధితులు తెలిపారూ. తనకు క్రషర్ మిషిను జెసిబిలు టిప్పర్లు ఉన్నాయని గల్ఫ్ లో కూడా తన కుమారుడు ఉన్నారని అక్కడ కూడా తన వాహనాలు ఉన్నాయని వాటికే డ్రైవర్లు కావాలని మాయమాటలు చెప్పి తమను మోసం చేశాడానీ బాధితులు వాపోయారు.

నిజామాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్ జగిత్యాల మెట్పల్లి ప్రాంతాలలో కూడా అనుమియ బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది.  తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని తన తల్లి ఆరోగ్యం బాగాలేదని అను మీయను ప్రాధేయ పడినప్పటికి ని తనకు డబ్బులు ఇవ్వలేదని నరసయ్య ఆరోపించారు.

ఈ విషయమై గత సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన పదో నెల  డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని సదరూ పోలీసులు అతని ఫోన్ చేసి పిలిపించి డబ్బులు ఇవ్వాల్సిందిగా చెప్పారని పోలీసుల ముందు డబ్బులు ఇస్తానని ఒప్పుకొని తీరా కనిపించకుండా పోయాడని బాధితుడు నరసయ్య తెలిపాడు.

గల్ఫ్ ఏజెంట్ అను మియా అలియాస్ ఎస్ కే సాహెబ్ అలియాస్  ఖాన్ నుండి డబ్బులు ఇప్పించాల్సింది గా బాధితుడు జిల్లా పోలీసులను ప్రాధేయపడుతున్నాడు. అతనిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని తనలాగా మరి ఎవరు పోకుండా చూడాలని పోలీసులను ఆయన కోరారు. తమతోపాటు మోసపోయిన ఇతర బాధితులకు కూడా న్యాయం చేయాలని అధికారులను నూతపల్లి గంగ నరసయ్య కోరాడు.