13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

డంపింగ్ యార్డులను సందర్శించిన జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్

30-01-2026 12:42 AM

ఘట్ కేసర్, జనవరి 29 (విజయకాంతి): జిహెచ్‌ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని చెత్త సేకరణ డంపింగ్ యార్డ్ కేంద్రాలను జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ టి. వినయ్ కృష్ణరెడ్డి గురువారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి తో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ప్రాథమిక సేకరణ పాయింట్ల పనితీరును పరిశీలించి, ద్వితీయ సేకరణ (సెకండరీ పాయింట్లు) అంశంపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. డోర్ టు డోర్ స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు.

ఎక్కడా కూడా జీవీపీ పాయింట్లు ఉండకుండా పూర్తిగా తొలగించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. అలాగే ఘట్కేసర్ సర్కిల్లోని ఏబీసీ (ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్) కేంద్రాన్ని కూడా సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న వనరులను పునర్వినియోగం చేసే విధంగా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నగర పారిశుధ్య ప్రమాణాలు మెరుగుపడేలా ప్రతి స్థాయి లో సిబ్బంది సమన్వయంతో పనిచేసి, స్వచ్ఛత కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి  సూచించారు.