16 April, 2026 | 12:38 PM

కేబీఆర్ పార్కులో జీహెచ్‌ఎంసీ కమిషనర్

04-06-2025 01:07 AM

- పనులను పరిశీలించిన ఆర్వీ కర్ణన్

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): కేబీఆర్ పార్కులో మంగళవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యటించారు. పార్కులో వాకర్స్ సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన పనులను వినూత్నంగా చేపట్టి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. లైసెన్స్ తీసుకున్న పెట్‌డాగ్స్‌ను మాత్రమే పార్కులోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు.

కేబీఆర్ చుట్టూ హెచ్ సిటీ ద్వారా చేపట్టే ఫ్లైఓవర్లు, అండర్ పాసులు కోర్టు ఆదేశాల మేరకు నిర్మిస్తున్నారా అని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్ సుభద్ర దేవి, డీసీ సమ్మయ్య, ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీలక్ష్మి, ఈఈ నాయక్, డిప్యూటీ ఈఈ హరీష్, సర్కిల్ ఈఈ విజయకుమార్ ఉన్నారు.