16 April, 2026 | 11:04 AM

కమలనాథుల బీజేపీ భరోసా

04-06-2025 01:06 AM
  1. ప్రజలకు అందుబాటులో పార్టీ నాయకులు
  2. ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజలకు చేరువయ్యేందుకు బీజే పీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం ద్వారా పార్టీకి మరింత గుర్తింపును తీసుకొచ్చేందుకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి, ప్రజల సమస్యలను పరిష్కరించేలా ‘బీజేపీ భరోసా’ పేరిట కొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్‌లో మంత్రులతో ఏర్పాటు చేసిన ఇలాంటి కార్యక్రమమే విజయవంతమైన నేపథ్యంలో బీజే పీ సైతం అదేబాట పట్టింది. జూన్ 2 నుంచి చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

జూన్ 2న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కార్యాలయంలో ప్రజలకు అందుబా టులో ఉన్నారు. ఉదయం 11 గంటల నుంచి  ఒంటిగంట వరకు జరిగిన బీజేపీ భరోసాకు చక్కని స్పందన వచ్చింది. ప్రజలు వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు.