calender_icon.png 17 July, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత

16-07-2025 11:20:33 PM

జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ షిరిడీ హిల్స్ కమిటీ హాల్ పార్కులో జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జోనల్ కమిషనర్, జిహెచ్ఎంసి కమిషనర్, బీజేపీ నాయకులు రావుల శేషగిరితో కలిసి వన మహోత్సవం సందర్భంగా బోరును ప్రారంభించి, మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... కాలనీ అసోసియేషన్ కు సంబంధించిన ప్రతీ ఒక్కరు ఇంటింటికి చెట్లను పంపిణీ చేసి వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.