17-07-2025 12:00:00 AM
ఇల్లందు, జులై 16, (విజయ క్రాంతి):సీతారామ ప్రాజెక్టు లక్ష్యం తెలియకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మంత్రులు తలతోక తెలియకుండా మాట్లాడుతున్నారని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సంజీవ నాయక్ అన్నారు. బుధవారం ఇల్లందు పట్టణంలోని పెన్షనర్స్ భవనం నందు జరిగిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తావని గవర్నర్ కు ఆర్డినెన్స్ పంపి మేము బీ సీలకు మేలు చేస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రా జ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం అమలయ్యే విధంగా చూడాలనీ డిమాండ్ చేశారు.
ఇలాగే గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్లను క ల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అమలు కాలేదన్నారు. తూతూ మంత్రంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని పత్రికల్లో ప్రకటనలు చేసినంత మాత్రాన సరిపోదని వెంటనే అమలు అయ్యే విధంగా చూడలన్నారు.
రాష్ట్రంలో ప్రతి పనికి 20% కమిషన్లతో ప్రజా పాలన సాగుతుందని, ఒక్కొక్క మంత్రి తమ శాఖలలో కమిషన్ లేనిదే పనులు చేయడం లేదని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇల్లందు, డోర్నకల్, మహబూబాబాద్, పినపాక నియోజకవర్గాలకు నీళ్లు రాకుండా కృ ష్ణా జలాలు పారే మధిర, పాలేరు, ఖమ్మం నియోజవర్గ వర్గాలకు సీతారామ ప్రాజెక్టును ద్వారా నీళ్లను తరలించు కొని భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు అన్యా యం చేస్తున్నారనీ మండిపడ్డారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా గిరిజన ప్రాంతాలకు నీరు వచ్చేవరకు బిఆర్‌ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయని తర్వాత వాటి ఊసే ఉండదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వీర్యం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు అయ్యేవరకు బిఆర్‌ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తేనే ఉంటామ న్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్ని నిర్బంధాలు ఎన్ని ఆటంకాలు కలిగించిన ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు.
ఈ కార్య క్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్, ఇల్లందు టౌన్ ఉపాధ్యక్షులు ఎస్.కె అబ్దుల్ నబీ, టేకులపల్లి మండల ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, బండారి శ్రీను, సుందరగిరి శ్రీను, లలిత్ కుమార్ పాసి, వసంత్ కుమార్, యాకూబ్ , ఉ పేందర్,రాజేష్,చిన్నారి,యాకయ్య, మహేష్, ఇమ్రాన్, శ్రీను, రఫీ, వీరు, కృష్ణ, శ్యామ్, జయరాజు, తదితరులు పాల్గొనడం జరిగింది.