calender_icon.png 16 July, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేయర్‌ను కలిసిన జీహెచ్‌ఎంసీ పీఆర్వో

16-07-2025 01:17:42 AM

హైదరాబాద్, జూలై 15: జీహెచ్‌ఎంసీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్‌ఓ)గా బాధ్యతలు స్వీకరించిన దశరథం.. సీపీఆర్వో మహ మ్మద్ ముర్తుజాతో కలిసి మంగళవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆమె ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మేయర్ ఆయనకు అభినందనలు తెలియజేస్తూ.. జీహెచ్‌ఎంసీ అభివృ ద్ధి పనులు, ప్రజా సేవా కార్యక్రమాలు మరింత ప్రాముఖ్యతతో ప్రజల దృష్టికి తీసుకెళ్లేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.