calender_icon.png 2 January, 2026 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిపురం అభివృద్ధి కాంగ్రెస్‌తోనే..

02-01-2026 12:00:00 AM

గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటా: సర్పంచ్ నీలా సైదులు

మరిపెడ, జనవరి 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామపంచాయతీ లో గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటాడని సర్పంచ్ నీలా సైదులు అన్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా గత సంవత్సర కాలం నుంచి గ్రామపంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్ గత సంవత్సరం నుంచి రిపేరు వచ్చి మూలకు పడి ఉండడంతో ఆ గ్రామ సర్పంచ్ చొరవతో తన సొంత ఖర్చులతో చెత్త సేకరణ ట్రాక్టర్ ను కొత్త సంవత్సరం రోజు గ్రామ ప్రజల ఆశీర్వాదంతో వినియోగంలోకి తేవడం జరిగింది.

అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న సర్పంచ్కు స్థానిక నాయకులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండయ్య, భాష పొంగు సురేష్ ,మస్తాన్ సలీం, యాకుబ్ పాషా ,చా ంద్, మదన్, రమేష్ ,మహేందర్ ,అశోక్, షరీఫ్ ,వీరన్న ,రాంబాబు, ఉపేందర్, జనార్ధన్, కరీం, నాగేష్, గణేష్ ,మనోజ్, సుమన్ ,ప్రశాంత్, పవన్, మహేష్, గ్రామపంచాయతీ సిబ్బంది రాముడు, లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.