calender_icon.png 2 January, 2026 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని

02-01-2026 12:00:00 AM

హనుమకొండ టౌన్ జనవరి 1 (విజయక్రాంతి): నూతన సంవత్సర సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సకుటుంబ సపరివార సమేతంగా గురువారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే నాయినికి పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికి, అమ్మవారి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి మంత్రోచ్ఛరణతో ఆశీర్వాదాలు అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారి కృపా కటాక్షాలతో కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజా ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించే విధంగా శక్తిని అమ్మవారు ప్రసాదించాలని వేడుకొన్నారు.