19 May, 2026 | 6:21 PM

Breaking News

బాలికా విద్యను ప్రోత్సహించాలి

20-06-2024 12:11 AM
  • ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి 

వనపర్తి, జూన్ 19 (విజయక్రాంతి) : బాలికలని ఉన్నత విద్య అభ్యసించే దిశగా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. గ్రామస్థాయిలో తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశా లల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలికలకు బుధవారం గ్రామీణ భాగస్వామ్య సంస్థ (వీఐపీ) ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన బాలికలకు వీఐపీ సంస్థ తరుపున రూ.5 వేల నగదుతోపాటు రూ. 20 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ప్రదానం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీవో పద్మావతి, డీఈవో గోవింద రాజులు, వీఐపీ సంస్థ ఈడీ నాగేంద్రస్వామి, మున్సిపల్ చైర్మన్ మహేశ్ పాల్గొన్నారు.