calender_icon.png 9 November, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలతో పంచుకున్న ఆనందం

08-11-2025 10:09:46 PM

సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా అన్నదానం..

పటాన్‌చెరులో శ్యామ్ రావు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం – కాంగ్రెస్ కార్యకర్తల విశేష స్పందన..

సంగారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 57వ జన్మదినాన్ని పురస్కరించుకుని పటాన్‌చెరు నియోజకవర్గంలో పేద కుటుంబాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు, జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు నర్శింహ రెడ్డి, నావరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్‌చెరు డీఎస్పీ ప్రభాకర్, 112వ డివిజన్ కార్పొరేటర్ పుష్ప నగేష్ హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచులు గాండ్ల శ్రీనివాస్, సంజీవ్ రెడ్డి, మతిన్, అతిక్, విక్రమ్ గౌడ్, మహేందర్ రెడ్డి, ముత్తంగి అశోక్, శ్రీను, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.