19 March, 2026 | 1:05 PM

Breaking News

మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •   రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్ష‌లు   •  

అమ్మాయిలు అదుర్స్

12-11-2024 12:00 AM
  1. మలేషియాపై భారత్ విజయం 
  2. నేడు కొరియాతో పోరు 
  3. ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ

రాజ్ గిర్: బిహార్ వేదికగా మొదలైన మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ అమ్మాయిల జట్టు అదరగొట్టింది. లీగ్ దశలో భాగంగా సోమవారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 ఘన విజయాన్ని అందుకుంది. భారత్ తరఫున సంగీతా కుమారి (ఆట 8వ, 55వ నిమిషంలో) డబుల్ గోల్స్‌తో మెరవగా.. ప్రీతి దూబే (43వ ని.లో), ఉదితా (44వ ని.లో) గోల్స్ సాధించారు.

విజయంతో టోర్నీని ఆరంభించిన సలీమా టిటే బృందం నేడు జరగనున్న రెండో మ్యాచ్‌లో కొరియాతో తలపడనుంది. తొలి క్వార్టర్స్ నుంచి ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన అమ్మాయిలు కడవరకు అదే జోరును చూపించారు. ఆట ప్రారంభంలోనే సంగీతా గోల్ కొట్టి భారత్‌కు శుభారంభం అందించింది. అయితే రెండు, మూడు క్వార్టర్స్‌లో ఇరుజట్లు ఎలాంటి గోల్స్ నమోదు చేయకపోయాయి.

అయితే ఆఖరి క్వార్టర్స్‌లో మళ్లీ విజృంభించిన భారత్ మూడు గోల్స్‌తో మెరిసి స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. భారత్‌కు లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకోవడం విశేషం. జపాన్, కొరియా మధ్య జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిర్ణీత సమయంలో గా ఇరుజట్లు 2 నిలిచాయి. అంతకముందు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్ల కెప్టెన్లతో కలిసి ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. అనంతరం టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు.