10-02-2026 01:08:55 AM
గెలుపు బాటలో తోట గంగాధర్
కోరుట్ల,ఫిబ్రవరి 9( విజయక్రాంతి): అవకాశం ఇవ్వండని స్వార్ధంగా వార్డుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని 8వార్డు కాం గ్రెస్ పార్టీ అభ్యర్థి తోట గంగాధర్ అన్నారు. సోమవారం వార్డులోని వివిధ కాలనీల్లో ఇంటింటికి వెళ్లి మహిళా సంఘాలతో మైనారిటీ కుల సంఘాల సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట గంగాధర్ కలుస్తూ చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
గెలిపిస్తే వార్డులో ఎలాంటి సమస్య లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు సహకారంతో వార్డులో మౌలిక వసతులు రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యంపై దృష్టి సారిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తోట గంగాధర్ కు మద్దతుగా కుల సంఘాల నాయకులు యువజన సంఘాల నాయకులు మైనార్టీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.