calender_icon.png 10 February, 2026 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలే ఎజెండాగా..ప్రజల్లో మమేకమై

10-02-2026 01:07:32 AM

పాల్వంచ 47వ డివిజన్ సీపీఐ అభ్యర్థి జీవీఆర్ ముమ్మర ప్రచారం 

పాల్వంచ, ఫిబ్రవరి 9(విజయక్రాంతి): కాంట్రాక్టర్, విద్యావేత్తగానే కాకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మున్సి పల్ కార్పొరేషన్ ఎన్నికల పోటీకి సిద్ధపడ్డారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన పా ల్వంచలోని 47వ డివిజన్ సీపీఐ అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర్లు (జీవీఆర్) తనదైన శైలి లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, డివిజన్ సమగ్రాభివృద్ధి ప్రధాన ఎజెండాగా ప్రచారానికి పదు ను పెట్టారు.

పాత పాల్వంచ లోని ఎస్సీ సా మాజిక వర్గానికి చెందిన జీవీఆర్ వ్యాపారవేత్తగా ఆయనకు పేరు ఉంది.ప్రజాసేవ చేయాలనే ఆలోచన రావడంతో ఈనెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీ ఐ నేతల సూచన మేరకు గుర్రం వెంకటేశ్వ ర్లు పోటీలోకి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కారానికి మార్గం చూపుతానని ఓటర్ దేవుళ్లకు హామీ ఇస్తున్నారు.

తమ అమూల్యమైన ఓటును కంకి కొడవలి గుర్తు పై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వేడుకుంటున్నారు. డివిజన్ పరిధిలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పునర్ని ర్మాణం,  విద్యుత్, స్తంభాలను వీది దీపాలను ఏర్పాటు చేయడం, అర్హులైన నిరుపే దలకు తెల్ల రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, వితంతువులకు, వృద్ధులకు, దివ్యాంగులకు   ఆసరా పెన్షన్లు ఇప్పించడం ,పాత పాల్వంచలో ఫంక్షన్ హాల్, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం ఏర్పాటుకు కృషి చేస్తానంటూ ప్రచా రం చేశారు.