27 June, 2026 | 5:15 AM

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా

06-12-2025 12:00 AM

రామగిరి సర్పంచ్ అభ్యర్థి చామల వాణి వెంకటరమణారెడ్డి

నకిరేకల్ డిసెంబర్ 5(విజయ క్రాంతి):  రామగిరి గ్రామ అభివృద్ధి నా లక్ష్యమని,ఈ సారి ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తే రామగిరి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని  రామగిరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చామల వాణి వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రామగిరి గ్రామంలో చామల వాణి వెంకటరమణారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిసారిగా తాను సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నానని, కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తే, గ్రామంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తూ, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో  మొగుళ్ళ శ్రీనివాస్, నిమ్మల కృష్ణమూర్తి, లోడంగి మహేష్, ఆకుల శ్రీనివాస్, నంద్యాల ప్రకాష్, యాదయ్య, సైదులు, శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.