సాలుర గ్రామంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
బోధన్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఆదేశాల మేరకు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ రూరల్ పోలీస్‌స్టేషన్ హద్దులో ఉన్న సాలూ రా మండలంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ ప్రజల్లో నమ్మకం పెంపొందించడం, శాంతి భద్రతలు కాపాడడం తోపాటు ఎన్నికల ప్రక్రి యలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రాంతి భద్రతల పరిరక్షణ నే ధ్యేయంగా నిర్వహించారు.
బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు అదనపు బలగాలు కూడా పాల్గొని గ్రామస్థులకు చట్ట-శాంతి పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రజలందరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి, ఎన్నికల నియమాలను పాటిం చి, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు తమ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సిపి సాయి చైతన్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సమయంలో , గందరగోళం సృష్టించడం, బెదిరింపులకు పాల్పడటం లేదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ అధికారి సాయి చైతన్య హెచ్చరించారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో స్వేచ్ఛాయుత , నిష్పక్షపతంగా, శాంతియుత ఎన్నికలు నిర్వహించడానికి కట్టుబడి ఉంది, అని తెలియజేశారు. కార్యక్రమంలో బోధన్ ఏసిపి శ్రీనివాస్, బోధన రూరల్ సిఐ విజయబాబు, బోధన్ ఎస్హెచ్‌ఓ వెంకట్ నారాయణ, బోధన్ రూరల్ ఎస్త్స్ర శ్రీ మచ్చేందర్ రెడ్డి, ఎడపల్లి ఎస్త్స్ర రమ, రెంజల్ ఎస్‌ఐ శ్రీ చంద్ర మోహన్ స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.




