calender_icon.png 4 November, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క అవకాశం నవీన్ యాదవ్ కి ఇవ్వండి

03-11-2025 04:58:43 PM

జూబ్లీహిల్స్ ముఖ‌ చిత్రాన్ని మార్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే

దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ 

దేవరకొండ (విజయక్రాంతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మామత్ నగర్ డివిజన్ లో సోమవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేస్తూ నవంబర్ 11వ తేదీన జరగబోయే ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 02 పై ఉన్న చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లని  దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కోరారు.

అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.పేద‌ల సంక్షేమం కోసం ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ. 500కే స‌బ్పిడీ గ్యాస్ సిలిండ‌ర్, స‌న్న‌బియ్యం, నూత‌న  రేష‌న్ కార్డులు పంపిణీ, ఇందిర‌మ్మ ఇండ్లు వంటి ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు.నవీన్ యాదవ్ స్థానికుడు కావడంతో ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ కాంగ్రెస్ నాయకులు, బూత్ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.