16 May, 2026 | 2:22 PM

కొత్త జానర్‌లోకి గ్లామర్ గాళ్!

16-02-2025 12:00 AM

ఇప్పటివరకు గ్లామర్ రోల్స్‌తో అభిమానులకు కనువిందు చేస్తూ వచ్చింది హెబ్బా పటేల్. ఉన్నట్టుండీ ఇప్పుడు రూటు మారుస్తున్నట్టు తెలుస్తోంది. గ్లామర్ ఇమేజ్ దాటి కొత్త జానర్, కొత్త క్యారెక్టర్ సినిమాలు చేయాలని అనుకుంటున్న హెబ్బా కెరీర్‌లో ‘మారియో’ మొదటి మలుపు అవుతుందా? అంటే, చాలా మంది నుంచి ఔననే సమాధానమే వస్తోంది! ‘నాటకం’, ‘తీస్మార్‌ఖాన్’ సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కళ్యాణ్ జీ గోగణ.

ఇప్పుడు ఆయన డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రమే ‘మారియో’. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కళ్యాణ్ జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకు రిజ్వాన్ నిర్మాత. మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అనిరుధ్ జోడీగా గ్లామరస్ హీరోయిన్ హెబ్బా పటేల్ యాక్ట్ చేస్తుండటంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హెబ్బా పటేల్ హీరోయిన్ అనగానే గ్లామర్ హైలైట్ చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ, ‘మారియో’ మేకర్స్ ఆ ఛాయల్లోకి వెళ్లడం లేదు. ప్రేమికుల రోజును పురస్కరించుకొని మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అదే చెబుతోంది. పోస్టర్‌లో రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు, దాన్ని వెంబడిస్తున్న పోలీస్ కారును చూస్తుంటే ఇదో కామిక్ థ్రిల్లర్ అనిపిస్తోంది.

‘ఫడ్ రైడ్’ అనే క్యాప్షన్‌ను బట్టి ఈ చిత్రం వినోదాత్మకంగా ఉండబోతోందని అర్థమవుతోంది. అడ్వెంచర్ కామెడీ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు.