calender_icon.png 21 September, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లెన్డేల్ అకాడమీ వార్షిక మారథాన్

21-09-2025 12:30:32 AM

-గ్లున్న్‌ల్రో పాల్గొన్న వందలాది మంది విద్యార్థులు

-హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): గ్లెన్డేల్ అకాడమీ ప్రతిష్టాత్మక కమ్యూనిటీ ఈవెంట్ గ్లెన్న్ ను విజయవంతంగా నిర్వహించింది. వందలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ మారథాన్, సేవ్ ది స్పారో అనే థీమ్‌తో గువ్వ సంరక్షణ మరియు జీవ వైవిధ్య పరిరక్షణపై అవగాహన కల్పించే శక్తివంతమైన వేదికగా నిలిచింది. బండ్లగూడ నుండి ఆర్మీ పబ్లిక్ స్కూల్ వరకు వెళ్లి తిరిగి గ్లెన్డేల్‌లో రన్ ముగిసింది.

3కే రన్, స్కేటింగ్, సైక్లింగ్, పోస్టర్, ఫోటోగ్రఫీ పోటీలు, నినాద రచన, గువ్వ గూడు తయారీ వర్క్‌షాప్ వంటి అనేక కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వా ములను చేశాయి. ముఖ్యంగా డీయైవై గూ ళ్లు ద్వారా గువ్వలకు సురక్షిత స్థలాలు సృ ష్టించడం ఎంత సులభమో చూపించారు. అదనంగా, సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 5 వరకు విద్యార్థులు గువ్వల సర్వే నిర్వహించి, గమనించిన వివరాలను ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మంత్రి శ్రీమతి కొండా సురేఖకు సమర్పించనున్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకట స్వామి, మాజీ భారత క్రికెట్ కెప్టెన్, కాంగ్రెస్ నేత నాయకుడు మొహమ్మద్ అజహరుద్దీన్ గ్లెన్డేల్ చర్యలను అభినందించారు. పర్యావరణ అవగాహన పెంపొందించడం లో ఇలాంటి కార్యక్రమాలు సమాజ నిర్మాణానికి మూలస్థంభాలుగా ఉంటాయన్నారు. గ్లెన్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ మిను సాలూజా మాట్లాడుతూ.. “ఈ ఏడాది గ్లెన్న్ సమా జం ఒకే లక్ష్యంతో ఏకమై తే మార్పు ప్రారంభమవుతుందని చూపించింది. మన పిల్లలు గువ్వల కోసం పరిగెత్త డం, సృష్టించడం, నిర్మించడం చూడటం విద్య అనేది కేవలం జ్ఞానం ఇవ్వ డం మాత్రమే కాదు  చర్యకు ప్రేరణ కల్పించాల్సిందని గుర్తుచేసింది” అన్నారు.