calender_icon.png 21 September, 2025 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23న మేడారానికి సీఎం రేవంత్

21-09-2025 12:30:57 AM

  1. జాతర పనులపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి 
  2. ఆయనతోపాటు మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
  3. పూజారుల సూచనలు, ఆమోదంతో మేడారం అభివృద్ధి నామూనాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఈ నెల 23న ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి మేడారానికి వెళ్తున్నారు. మేడారం అభివృద్ధి ప్రణాళికకు సంబంధించిన డిజైన్లను ఆలయం పూజారుల సూచనలమేరకు వారి ఆమోదంతో ముఖ్యమంత్రి ఖరారు చేయనున్నారు. మేడారం అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క, సారలమ్మ పూజారులను సంప్రదించిన తర్వాత అభివృద్ధి డిజైన్లను విడుదల చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

శనివారం సాయంత్రం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో అధికారులతో మేడారం అభివృద్ధిపై సీఎం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మేడారాన్ని సందర్శించి.. అభివృద్ధికి సంబంధించి పూజారులతో చర్చించి, వారి సలహాలు, సూచనల ప్రకారం.. వారి ఆమోదంతోనే డిజైన్లను విడుదల చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. మేడారం జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. 

గిరిజన సంప్రదాయాలను గౌరవించాలి..

పూజారులు కోరిన విధంగా ప్రసుత్తమున్న ఆలయ ఆవరణను మరింత విస్తరిం చాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే గద్దెలను యథాతథంగా ఉంచి గిరిజన సంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని సీఎం ఆదేశించారు. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్టు ఉండాలని సీఎం పేర్కొన్నా రు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంత సంప్రదాయ వృక్షాలు ఉండేలా చర్య లు తీసుకోవాలని సీఎం తెలిపారు. ఈనెల 23న సీఎంతోపాటు మేడారానికి మంత్రు లు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు వెళ్లనున్నారు.