10-05-2025 12:14:59 AM
-చైనాలో భారీగా పెరిగిన అప్పులు
న్యూఢిల్లీ, మే 9: ప్రపంచ అప్పులు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. జనవరి మార్చి 2025 పీరియడ్‌లో 324 ట్రిలియన్ డాలర్ల ఆల్ టైమ్ రికార్డుకు రీచ్ అయ్యాయి.
చైనా, ఫ్రాన్స్, జర్మనీలు ఈ అప్పుల పెరుగుదలకు కారణాలుగా ఉండగా.. అదే సమ యంలో కెనడా, యూఏఈ, టర్కీల్లో రుణస్థాయిలు పడిపోయాయి. మొదటి త్రైమా సికంలో మొత్తం రుణం 3.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల మేర పెరిగి.. 106 ట్రిలియన్ అమెరికన్ డాలర్లను చేరుకుంది. ఒక్క చైనానే 2 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల అప్పు చేసింది. వడ్డీ రేట్లు పెరగడం వంటి కారణాలు అప్పుల పెరుగుదలకు కారణాలుగా ఉన్నాయి.