calender_icon.png 10 May, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు!

10-05-2025 01:57:04 AM

  1. 36 ప్రాంతాల్లో 300-400 డ్రోన్లతో దాడులు చేసింది
  2. పాక్ తీరును ఎండగట్టిన విదేశాంగ, రక్షణశాఖ అధికారులు
  3. ప్రపంచాన్ని మోసం చేస్తున్న పాక్.. 
  4. విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

న్యూఢిల్లీ, మే 9: పాకిస్థాన్ మిలటరీ టర్కీ లో తయారయిన ‘ఆసిస్‌గార్డ్ సోంగర్’ డ్రోన్ల తో భారతీయ నగరాలపై దాడి చేసిందని అధికారులు అనుమానం వ్యక్తం చేశా రు. శుక్రవారం విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. పాక్ కుటిల బుద్దిని బయటపెట్టారు. కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. ‘గురువారం అర్ధరాత్రి పాకిస్థాన్ మిలటరీ భారత గగనతలంలోకి ప్రవేశించి ఉల్లంఘనలకు పాల్పడింది.

పశ్చిమ సరిహద్దు వెంట మౌ లిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి కూ డా పాక్ పెద్ద ఎత్తున కాల్పులకు దిగింది. సరిహద్దు వెంబడి, నియంత్రణ రేఖ వెంబడి లేహ్ నుంచి శ్రీ క్రీక్ వరకు 36 చోట్ల పాక్ 300 డ్రోన్లను ప్రయోగించింది. ఈ డ్రోన్ల ప్రయోగం వెనుక భారత వైమానిక రక్షణ వ్యవస్థ బలం తెలుసుకోవడమే కాకుం డా, నిఘా సమాచార సేకరణ లక్ష్యంగా ఈ దాడులు చేశారు. అర్ధరాత్రి తర్వాత పాక్‌కు చెందిన యూఏవీ బఠిండాలోని ఆర్మీ స్థావరంపై దాడికి ప్రయత్నించింది.

దానిని పసి గట్టి కూల్చేశాం. పాక్ దాడులకు ప్రతిస్పందనగా భారత్ కూడా పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై డ్రోన్లను ప్రయోగించింది. ఒక డ్రోన్ ఏడీ రాడార్‌ను ధ్వంసం చేసింది. పాకిస్థాన్ రేంజర్లు నియంత్రణ రేఖ వెంబడి కూ డా కాల్పులకు తెగబడ్డారు. ఉరి, పూంచ్, మెంధర్, రాజౌరి, అక్నూర్, ఉదంపూర్ సెక్టార్లలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సైని కులకు కొంత నష్టం జరిగింది. అదే విధంగా పాకిస్థాన్‌కు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. పాకిస్థాన్ పౌర విమానాలకు గగన తలాన్ని మూసేయలేదు.

కరాచీ మధ్య విమానాలు నడుస్తూనే ఉన్నాయి. గు రువారం రాత్రి జరిపిన డ్రోన్ల దాడిలో పాక్ తన పౌరవిమానాలను కవచంగా ఉపయోగించుకుంది. జమ్మూ, పఠాన్‌కోట్, ఉదం పూర్ ప్రాంతాల్లో ఉన్న మిలటరీ బేస్‌లపైకి డ్రోన్లను ప్రయోగించగా.. భారత దళాలు తిప్పికొట్టాయి.’ అని వెల్లడించారు. పాక్ డ్రో న్ల దాడులకు సంబంధించిన డేటా తో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాక్ కుటిల బుద్దిని మీడియాకు వివరించారు. 

తప్పుదోవ పట్టిస్తున్న పాక్ 

ఈ సమావేశంలో పాల్గొన్న విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ ప్రపంచాన్ని మోసం చేస్తుంది. ప్రార్థనా మందిరాలపై దాడులు చేయట్లేదని చెబుతూ దాడులకు దిగుతోంది. సాయుధ దళాలు అనేక మార్గాలను ఉపయోగించి పాక్ డ్రోన్లను కూల్చేశాయి. పాకిస్థాన్ అమృత్‌సర్, పూంచ్‌లోని గురుద్వారాపై దాడికి ప్రయత్నించింది. కర్తార్‌పూర్ సాహిబ్ సర్వీసులను నిలిపివేస్తున్నాం. ఇంట్లో ఆడుకుం టున్న ఇద్దరు విద్యార్థులు పాక్ దాడులకు బలయ్యారు.

నార్వే విదేశాంగ శాఖతో జైశంకర్ మాట్లాడారు. బహవల్‌పూర్‌లో జైషే సంస్థ ప్రధాన కార్యాలయం ఉందని అందరికీ తెలుసు. అంతర్జాతీయ పౌరుల గురించి భారత్ సంయవనం పాటిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధం’ అని పేర్కొన్నారు. పాక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి రుణానికి ప్రయత్నిస్తోంది. ఈ రుణం విషయంలో భారత్ తన వైఖరిని ఇప్పటికే తెలియజేసింది. 

విమానాశ్రయాలే లక్ష్యంగా దాడులు.. 

కల్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ.. ‘ప్రధానంగా భారత్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిపారు. 36 ప్రాం తాల్లో దాడులు జరిపారు. పౌర విమానాలు రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటూ పాక్ ఈ దాడులకు తెగబడింది.’ అని వెల్లడించారు.