04-09-2025 12:07:20 AM
వేదిక్ మ్యాథ్స్ ఫౌండర్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూ రు కాపులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలు అమెరికాలోని వర్జీనియాలో ఉత్సాహంగా జరిగాయి. రెండురోజుల పాటు భారీ ఎత్తున వీటిని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖలతో పాటు సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. మహిళల కోసం ప్రత్యేకంగా అందాల పోటీలు, ముగ్గుల పోటీలతో పాటు సంగీత పోటీలు, చిన్నారుల కోసం మ్యాజిక్ షో నిర్వహించారు. అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు, ఇతర వివరాలతో రూపొందించిన సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త, టెక్నాలజీ నిపుణుడు వేదిక్ మ్యాథ్స్ ఫౌండర్ గాయత్రి రజనీకాంత్‌కు అత్యుత్తమ సామాజిక సేవా పురస్కారం అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన ఆమె ఉస్మానియా యూని వర్సిటీలో డిగ్రీ పట్టా పొంది విదేశాల్లో మాస్టర్స్ కంప్యూటర్స్ కోర్టు చేశారు. 2010 లో అమెరికాలో ఉం టున్న భారతీయుల కోసం వేదిక్ మ్యాథ్స్ ను స్థాపించారు. దాదాపు 15 ఏళ్ళుగా వేదిక్ మ్యాథ్య్ ఎంతో గుర్తింపు సాధించింది.
క్లిష్టమైన గణిత సమస్యలకు వేదిక్ మ్యాథ్స్ చక్కని పరిష్కారాలు చూపిస్తూ ఆదరణ పొందింది. విద్యావేత్తగా 2600 మందికి పైగా స్టూడెంట్స్‌కు సేవలందించినందుకు గానూ గాయత్రి రజనీకాంత్ ను గ్లోబల్ ము న్నూరు కాపు అసోసియేషన్ ఈ పురస్కారంతో సత్కరించింది. గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్‌ను విజయవంతంగా నడిపిస్తున్న దాతలను ప్రత్యేకంగా అభినందించారు.
అతిథులను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ తరపున పలు ప్రాంతాల్లో సేవలందిస్తున్న వలంటీర్లను సత్కరించారు. ఈ సందర్భంగా 2026కు సంబంధించి అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, మహాసభల కన్వీనర్ రజనీకాంత్ సంఘని సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులందరినీ ఏకం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. మహాస భలకు హాజరైన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియే షన్ వ్యవస్థాపక సభ్యులు, అధ్యక్షుడు వెంకట్ పెద్ది కృతజ్ఞతలు తెలిపారు.