calender_icon.png 14 January, 2026 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం

14-01-2026 08:27:59 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో బుధవారం నాడు వేద పండితుల చేత శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట గణపతి పూజ పుణ్య ఆవశనం అఖండ దీపారాధన అనంతరం కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం భక్తులు ఓడు బియ్యం పోసి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బాపురెడ్డి సభ్యులు శేఖర్ నరసింహులు. సర్పంచ్ ఐరన్ నరసయ్య, ఉప సర్పంచ్ బొమ్మరి శ్రీనివాస్,వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్ కూరలత సంతోష్, మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, నాయకులు కుంచాల శేఖర్,నల్లపు శ్రీనివాస్,నాగరాజ్ పోచయ్య, శంకర్, తదితరులు మొక్కలు చెల్లించుకున్నారు.