calender_icon.png 12 August, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరి జలాలు బనకచర్లకు తరలింపు

25-07-2025 12:00:00 AM

  1. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కలిసి కుట్ర  
  2. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో ప్రగతి కుంటుపడిందని, ఇందిరమ్మ ఎమర్జెన్సీ మళ్లీ వచ్చిందని బీఆర్‌ఎస్ మా జీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఎన్నడూ జై తెలం గాణ అనలేదని, ఢిల్లీకి ఊడిగం చే స్తూ చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

గురువారం హైదరాబాద్‌లో ని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్క సు మన్ మాట్లాడుతూ.. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కలిసి కుట్ర చేసి గోదావ రి జలాలను బనకచర్ల ప్రాజెక్టుకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పి కొట్టేందుకు తమ వి ద్యార్థి విభాగం నేతలను సన్నద్ధం చేసేందుకు సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కేసులు పెట్టి వేధిం చడమే ఇందిరమ్మ పాలనా అని, కే టీఆర్ బర్త్‌డే ఫ్లెక్సీలను జీహెచ్‌ఎంసీ చించేయడం అరాచకమన్నారు. బనకచర్లను కేంద్ర సంస్థలు తిరస్కరిం చాయని, తన గురువుకు ధారాధత్తం చేసే పనిలో రేవంత్‌రెడ్డి ఉన్నారని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమా ర్ విమర్శించారు. ప్రశ్నిస్తే కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.