24-07-2025 11:17:22 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(BRS Working President KTR) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ సంబరాలు ఆనందంగా జరుపుకున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందడానికి కేటీఆర్ చేసిన కృషి మరువలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.