24-07-2025 11:19:45 PM
మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్..
కామారెడ్డి (విజయక్రాంతి): కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్(Former Government Whip Gampa Govardhan) అన్నారు. గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే తరానికి గొప్ప నాయకునిగా కేటీఆర్ ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ యాదవ్, కుంభాల రవి యాదవ్, జగదీష్ యాదవ్, గైని శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి మినుకూరి రాంరెడ్డి, జూకంటి మోహన్ రెడ్డి, కొత్తింటి శ్రీనివాస్ రెడ్డి, బల్వంత్ రావు, లక్ష్మీనారాయణ, పిట్ల వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.