calender_icon.png 11 July, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాకాంబరీ అమ్మవారిగా శ్రీ శుభానందదేవి, శ్రీ సరస్వతి దేవి

11-07-2025 12:00:00 AM

మహదేవపూర్, జులై 10 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ శుభానంద దేవి, శ్రీ సరస్వతి దేవి అమ్మవార్లకు ఆషాడ మాసం సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ  రకాలైన కూరగాయలతో శాకాంబరి అలంకరణ చేశారు.

ఆషాడ మాసం గురు పౌర్ణమి సందర్భంగా శుభానందా దేవి, శ్రీ సరస్వతి దేవి, అమ్మవార్లకు వివిధ రకాలైన కూరగాయలతో అలంకరించడం జరిగిందని ఆలయ ఈవో మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు,అర్చకులు ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకునిగా రామాచారి నియామకం

మహాదేవపూర్, జూలై 10 (విజయ క్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం ప్రధాన అర్చకునిగా ఆరుట్ల రామాచారి నియమించినట్లు ఆలయ కార్య నిర్వాహణా ధికారి మహేష్ తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హైదరాబాద్  ఉత్తర్వుల ప్రకారం ఆరుట్ల రామాచారికి పదోన్నతి కల్పించి ఆలయ ప్రధాన అర్చకులుగా నియమించడం జరిగిందని తెలిపారు.  ఆలయ ఈవో తో పాటు ఉప ప్రధాన అర్చకులు నగేష్ శర్మ, ఆలయ సూపరిండెంట్ బుర్రి మహేష్ ఉన్నారు.