calender_icon.png 11 July, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు

10-07-2025 11:07:01 PM

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్ఐ వేణు గోపాల్..

శేరిలింగంపల్లి: గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ వేణుగోపాల్(SI Venugopal) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఒక కుటుంబ కలహాల కేసు విషయంలో ఎస్ఐ వేణుగోపాల్ ₹25,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం తీసుకుంటుండగా ఎస్ఐ వేణు గోపాల్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలనే ప్రమోషన్ పొంది ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన వేణు గోపాల్ ఈ అవినీతికి పాల్పడటం గమనార్హం. సిటీ రేంజ్-1 ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిపినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.