calender_icon.png 14 October, 2025 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగదు చోరీ

14-10-2025 08:34:29 AM

10 తులాల బంగారం, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లిన దుండగులు 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 

ఇబ్రహీంపట్నం: ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి 20.5 లక్షల విలువ చేసే పది తులాల బంగారం, వెండి ఆభరణాలు, నగదును గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్(Ibrahimpatnam Police Station) పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని  బోయవాడలో ఎలమోని రవీందర్ (48), తండ్రి బాలయ్య తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా అతను ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో తన భార్య మంగ, తల్లి రత్నమ్మ కలిసి నేరడ్ మెట్ లోని అతని సోదరి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో అతని కుమారుడు కార్తీక్ ఇంట్లోనే ఉన్నాడు.

కాగా కార్తీక్ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి, తలుపులన్నీ తెరచి ఉండటం గమనించాడు. దింతో ఇంట్లోకి ప్రవేశించిన అతను అనుమానం వచ్చి అల్మారాను  తనిఖీ చేశాడు. కాగా అల్మారా అప్పటికే తెరిచి ఉండటంతో అందులోని వస్తువులను తనిఖీ చేయగా అందులో లేకపోవడంతో చోరికి గురైనట్లు గుర్తించాడు. వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. అల్మారా నుండి 20.5లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు,  వెండి ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు ఎలమోని బాలయ్య ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేయగా, దింతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.