14-10-2025 01:58:41 AM
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అం శంపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నది. ఈ సమావేశంలో బీసీలకు విద్యా, ఉద్యోగ రం గాలతో పాటు రాజకీయంగా స్థానిక సంస్థ ల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాం గ్రెస్ చిత్తశుద్ధితోనే పని చేస్తోందనే సందేశాన్ని ఇవ్వనుంది. అఖిలపక్ష సమావేశానికి రాని పార్టీలను బీసీల దోషిగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం విధానం సరిగాలేదని వివిధ పా ర్టీలు, కుల సంఘాల నుంచి విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో అఖిలక్ష సమావేశం ఏ ర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పని విధానం, భవిష్యత్‌లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఆయా పార్టీల నేతలకు స్ప ష్టత ఇస్తే ప్రజల్లోకి తప్పుడు ప్రచారం వెళ్లకుండా అడ్డుకట్ట వేయవచ్చనే అంచానకు వచ్చినట్టు తెలిసింది.
ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఒకరిద్దరు సీనియర్ నాయకులు తీసుకెళ్లారి సమాచారం. అం దుకు సీఎం కూడా సానుకూలంగా స్పందిచారని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. కాగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి బిల్లును పంపిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లోనే ఉన్నది. దీంతో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 9 ఇచ్చి ఎన్నికలకు ముం దుకు వెళ్లగా, దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లడంతో స్టే ఇచ్చింది.
దీంతో స్థానిక ఎన్నికలు ఆగిన విషయం తెలిసిందే. అయితే హై కోర్టు స్టేకు వ్యతిరేకంగా ప్రభుత్వం సప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఈ కేసులో పార్టీ నేతలు కూడా ఇంప్లీడ్ కానున్నారు. మిగతా పార్టీలు కూడా ఇంప్లీడ్ కావాలని అధికార కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. సుప్రీంకోర్టులో ఇం ప్లీడ్ కాని పార్టీలుంటే వారిని బీసీ వ్యతిరేకులనే అంశం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అస్కా రం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తునట్టుగా తె లుస్తున్నది. .
కేంద్రంలోని బీజేపీ సహకరించడం లేదు?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించడం లేదని కాంగ్రెస్‌తో పాటు కొన్ని కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 18న రాష్ట్ర బంద్‌కు కూడా పిలుపునిచ్చాయి.
బీసీల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా అవసరమైతే పార్టీ శ్రేణులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలనే ఆలోచనతో ఉన్నది. ఈ బీసీ ఉద్యమానికి కలిసి రాని పార్టీలను ప్రజల్లో దోషిగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుందని చర్చ జరుగుతోంది. బీసీ కోటాకు సాధనకు సహకరించిన వారికే ప్రజల మద్దతు ఉంటుందని చెప్పే ప్రయత్నాలు ఇక ఊపందుకోనున్నాయి.