14-10-2025 09:12:38 AM
మంథని,(విజయక్రాంతి): మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన ఉప్పు మహేష్ మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి ఎస్ ఎస్ బి ఇటుక బట్టి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మృతి చెందారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటన స్థాలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.