ముత్తూట్ ఫిన్‌కార్ప్‌లో గోల్డ్‌లోన్ మోసం
మాజీ మేనేజర్‌పై కేసు
కూకట్‌పల్లి, జూలై 10 (విజయక్రాంతి): తక్కువ వడ్డీకే బంగారం పై లోన్ ఇప్పిస్తామంటూ భారీగా మోసానికి తరలేపిన సంఘటన కే పి హెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధి కే పి హెచ్ పి ఆరోవ ఫేజ్ ముత్తూట్ ఫిన్ కార్ప్ లో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ముత్తూట్ ఫిన్ కార్ప్ లో ప్రియాంక రెడ్డి గత కొంతకాలంగా బ్రాంచ్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తుంది.
తమ ఫైనాన్స్ లో కంటే తక్కువ వడ్డీకే బంగారంపై లోన్ ఇప్పిస్తానంటూ తమ బ్రాంచ్ వద్దకు వస్తున్న కస్టమర్లకు ఆశ చూపి దాదాపు రూ. 10 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని 40 మంది కస్టమర్ల నుంచి సేకరించి ఇతర ఫైనాన్స్ లకు అక్రమంగా బదిలీ చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ లో 14 శాతం వడ్డీ పై లోన్ తున్నారని, తనకు తెలిసిన మరొక ఫైనాన్స్ లో 6 శాతం వడ్డీ పై లోన్ ఇప్పిస్తానంటూ తన పేరు పైన లోన్ తీసుకొని కస్టమర్లకు ఇప్పించిన ప్రియాంక రెడ్డి.
లోన్ పై వడ్డీ డబ్బులను కస్టమర్ల నుండి తన బ్యాంకు ఖాతాలో వేయించుకొని కస్టమర్లను మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా బంగారం రేటు పెరగడంతో తీసుకున్న లోన్ పై టాప్ లోన్ కస్టమర్లకు తెలియకుండా తానే తీసుకొని బాధితులను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. తీసుకున్న లోన్ డబ్బులు మొత్తం కట్టి బంగారం విడిపించుకోవడానికి కస్టమర్ వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. దీంతో కొంతమంది బాధితులు ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యానికి, సమీప కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.






