07-12-2025 11:09:45 AM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన సెకండ్ తెలంగాణ స్టేట్ ఇంటర్ స్కూల్ తైక్వాండో ఛాంపియన్షిప్లో కందనూల్ జిల్లాకు చెందిన విద్యార్థులు బంగారు బతకాల సాధించారు. మొత్తం నాలుగు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ సాధించి జిల్లాకు గౌరవం తీసుకువచ్చారు.
రితిక, ఉప్పల శ్రావ్య, వేముల రుద్ర అనిల్, చిత్తముని ప్రణీత్ లు బంగారు పథకాలు సాధించగా క్యొరుగి సబ్ జూనియర్ ఫైట్ విభాగంలో రితిక సిల్వర్ సాదించారు. విద్యార్థుల ప్రతిభ పట్ల నాగర్ కర్నూల్ జిల్లా తైక్వాండో ప్రెసిడెంట్ డా. తెప్ప శీను, జనరల్ సెక్రటరీ ఏ. రవికుమార్, జిల్లా తైక్వాండో అసోసియేషన్ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసి వారికి అభినందనలు తెలిపారు.