07-12-2025 08:21:11 AM
కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలో బెల్టు షాప్ పై శనివారం పోలీసులు మెరుపుదాడి నిర్వహించి అక్రమంగా నిల్వ ఉన్న వివిధ రకాల కంపెనీలకు చెందిన 27 మద్యం క్వార్టర్ బాటిళ్ళ విలువ సుమారుగా రూ.5 వెయ్యిల వరకు ఉంటుందని, నిందితుడైన బెల్టు షాప్ యజమాని సిర్గాపురం హన్మా గౌడ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు కల్హేర్ ఎస్ఐ రవి గౌడ్ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైన అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రవి గౌడ్ హెచ్చరించారు.