calender_icon.png 2 July, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తైక్వాండోలో బంగారు పతకాలు

02-07-2025 12:00:00 AM

గ్లెండేల్ అకాడమీ విద్యార్థుల ఘనత

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): హైదరాబాద్ సన్‌సిటీలోని గ్లెండేల్ అకాడమీకి చెందిన ఇద్దరు యువ అథ్లెట్లు జూన్ 26న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్ బంగారు పతకాలు సాధించారు. ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న బలమై న పోటీదారులపై విజయం సాధించారు.

7వ తరగతి విద్యార్థి రుమైసా ఖలీద్ అండర్--14 విభాగంలో పోటీ పడగా, 5వ తరగతి విద్యార్థి మహ్మద్ జయాన్ ఖలీద్ అండర్--12 విభాగం లో తన ప్రతిభను ప్రదర్శించాడు. ఇద్దరు విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. ఇది పాఠశాలకు మాత్రమే కాకుండా హైదరాబాద్ నగరానికి కూడా కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ పోటీ ల్లో తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి 350 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు.

రుమై సా, జయాన్ తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం ఇదే మొదటిసారి కాదు. మార్చిలో 13 వ ఓపెన్ స్టేట్ ఇంటర్-స్కూల్ పూమ్సే, క్యోరుగి టైక్వాండో పోటీ 2025 పోటీల్లోనూ ఈ విద్యార్థులు బంగారు పతకాలు గెలుచుకున్నారు. గ్లెం డేల్ అకాడమీ సీనియర్ ప్రిన్సిపాల్ మధు ఖన్నా మాట్లాడుతూ..రుమైసా, జయాన్ల అత్యుత్తమ విజయానికి తాము చాలా గర్వపడుతు న్నామని చెప్పారు.

గ్లుండేల్‌లో తాము విద్యార్థులను భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. రుమైసా ఖలీద్ మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ తనకు మద్దతు ఇచ్చినందుకు కోచ్‌లు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మొహమ్మద్ జాయాన్ ఖలీద్ మాట్లాడుతూ.. తన పాఠశాలకు, తనను నమ్మిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు.