26 August, 2026 | 12:20 PM

Gold Price Today: హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,130

01-07-2026 12:32 AM
  1. హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర 1,40,130
  2. ఒక్కరోజులో 3 వేలు తగ్గుదల

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): మదుపర్లు పెద్ద ఎత్తున ఉన్న బంగారాన్ని విక్రయిస్తుండటం, దేశీయంగా బంగారంపై దిగుమతి సుంకాల సవరణ, అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో దేశీయంగా బంగారం ధరలు పడిపోతున్నాయి.

Gold Price Today: హైదరాబాద్‌లో బంగారం ధరలు (Gold Rate in Hyderabad) ఒక్కరోజులోనే దాదాపు రూ.3 వేల వరకు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ప్రస్తుతం రూ.1,40,130కు చేరింది. Gold Price Fall వెనుక కారణాలు, నిపుణుల విశ్లేషణ, భవిష్యత్ అంచనాల పూర్తి వివరాలు తెలుసుకోండి.

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,020 పలుకగా, మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40, 130 దిగొచ్చింది. ఒక్కరోజులోనే రూ. 2,890కు తగ్గింది. కాగా పశ్చిమాసియాలో క్రమేణా పరిస్థితులు మెరుగుపడటం, రవాణా సౌకర్యాలు వేగవంతం కావడం కూడా బంగారం ధరల తగ్గేందుకు కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రశ్న: హైదరాబాద్‌లో నేడు 10 గ్రాముల బంగారం ధర ఎంత?

సమాధానం: హైదరాబాద్‌లో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,40,130గా నమోదైంది. ఒక్కరోజులో దాదాపు రూ.2,890 మేర తగ్గింది. మదుపర్ల అమ్మకాలు, దిగుమతి సుంకాల మార్పులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

FAQ's

Q1. హైదరాబాద్‌లో నేడు 10 గ్రాముల బంగారం ధర ఎంత?
A: నేడు హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,40,130గా నమోదైంది.

Q2. బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
A: మదుపర్లు బంగారం విక్రయించడం, దిగుమతి సుంకాల సవరణలు, US Federal Reserve వడ్డీ రేట్ల విధానాలు ప్రధాన కారణాలు.

Q3. ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
A: ధరలు తగ్గుతున్న సమయంలో దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు కొనుగోలు అవకాశం ఉండొచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Q4. 24 CARAT మరియు 22 CARAT బంగారంలో తేడా ఏమిటి?
A: 24 క్యారెట్ బంగారం స్వచ్ఛమైనది కాగా, 22 క్యారెట్ బంగారంలో ఇతర లోహాల మిశ్రమం ఉంటుంది.