8 July, 2026 | 12:53 AM

గోల్డ్ మైన్స్ కోసం పోటాపోటీ

15-05-2024 12:05 AM

బిడ్డింగ్‌లో హింద్ జింక్, జిందాల్ పవర్, జేకే సిమెంట్

న్యూఢిల్లీ, మే 14: రాజస్థాన్‌లోని రెండు గోల్డ్ మైన్స్‌ను చేజిక్కించుకునేందుకు హిందుస్థాన్ జింక్, జిందాల్ పవర్, జేకే సిమెంట్‌లు పోటీ పడుతున్నాయి. బంగా రం గనుల తవ్వకానికి ఈ ఏడాది మార్చిలో  కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వేలం ప్రక్రియ ఈ వారంలో ముగియనుంది. వేదాంత్ గ్రూప్‌నకు చెందిన హింద్ జింక్, జిందాల్ పవర్, జేకే సిమెంట్‌తో  పాటు రామ్‌ఘడ్ మినరల్స్, హిరాకుడ్ నేచురల్ రిసోర్సెస్, పొద్దార్ డైమండ్ తదితర కంపెనీలు సైతం రాజస్థాన్‌లోని భూకియాజాగ్ పురా గోల్డ్ బ్లాక్, కంక్రియా గారా గోల్డ్ బ్లాక్‌ల బిడ్డింగ్‌లో పోటీపడ్డాయి. 

జొన్నగిరి ప్రాజెక్టులో 750 కేజీల బంగారం ఉత్పత్తి

దేశంలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్ అయిన ఆంధప్రదేశ్‌లోని జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టులో ఈ సంవత్సరాంతం నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తి జరుగుతుందని ఆ గనిని నిర్వహిస్తున్న డెక్కన్ గోల్డ్ మైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ చెప్పారు. పూర్తి స్థాయి ఉత్పత్తి మొదలైతే ఈ మైన్ ద్వారా ఏడాదికి 750 కేజీల బంగారం ఉత్పత్తవుతుందని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో పైలెట్ కార్య కలాపాలు మొదలుకాగా, నెలకు కేజీ బంగా రం ఉత్పత్తవుతున్నది. ఇప్పటివరకూ ఈ గనిపై రూ.200 కోట్లు పెట్టుబడి చేశారు.